Vande Bharat | నమో ర్యాపిడ్ రైల్ సహా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ..
Vande Bharat | నమో భారత్ ర్యాపిడ్ రైల్ సహా పలు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ అహ్మదాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్-సికింద్రాబాద్, కొల్హాపూర్-పుణే, ఆగ్రా క్యాంట్ - వారణాసి, దుర్గ్-విశాఖపట్నం, పుణే - హుబ్బళి, విశాఖపట్నం-రాయ్‌పూర్ సహా భుజ్-అహ్మదాబాద్ మధ్య తొలి మెట్రో రైలును ప్రారంభించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Vande Bharat | నమో భారత్ ర్యాపిడ్ రైల్ సహా పలు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ అహ్మదాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్-సికింద్రాబాద్, కొల్హాపూర్-పుణే, ఆగ్రా క్యాంట్ – వారణాసి, దుర్గ్-విశాఖపట్నం, పుణే – హుబ్బళి, విశాఖపట్నం-రాయ్‌పూర్ సహా భుజ్-అహ్మదాబాద్ మధ్య తొలి మెట్రో రైలును ప్రారంభించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలిసారిగా వందే భారత్ మెట్రో రైలును భారతీయ రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ప్రారంభానికి ముందు ఈ రైలుకు నమో భారత్ ర్యాపిడ్ రైలుగా నామకరణం చేశారు. భుజ్ – అహ్మదాబాద్ మధ్య 359 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5.45 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోనున్నది. రెండు నగరాల మధ్య టికెట్ ధర రూ.455 నిర్ణయించారు. ఈ మెట్రో రైలు గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తనున్నది.
మార్గమధ్యలో అంజర్, గాంధీధామ్, భచౌ, సమాఖియాలీ, హల్వాడ్, ధృంగాధ్ర, విరామ్‌గామ్, చంద్లోడియా, సబర్మతి స్టేషన్లలో ఆగనున్నది. రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైలును తీసుకువచ్చింది. పట్టణ స్టేషన్ల మధ్య పనిచేసే సాంప్రదాయ మెట్రోలకు భిన్నంగా.. నమో భారత్ ర్యాపిడ్ రైలు అంతర నగర గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. పట్టణ కేంద్రాలను చుట్టుపక్కల ప్రాంతాలతో కలుపుతుంది. ఈ రైలులో 2,058 మంది ప్రయాణించవచ్చు. 1,150 మందికి సీటింగ్ సదుపాయం ఉంటుంది. రైలులో సీటింగ్ కోసం కుషన్డ్ సీటింగ్ అమర్చారు. కోచ్లన్నింట్లో ఎయిర్ కండీషన్ ఉంటుంది. చూసేందుకు వందే భారత్ తరహాలో కనిపించినా.. రెండు చివర్లలో ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, ఇంజిన్స్‌తో వస్తుంది. రైలులో ప్రయాణానికి ముందు మాత్రమే ప్రయాణికులు టికెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో రూ.8వేలకోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని సీఎం భూపేంద్ర పటేల్, మంత్రులు ఘన స్వాగతం పలికారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

