PM Modi : ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) దేశ ప్రజలకు శ్రీరామనవమి (Sriram Navami) శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముని ఆశీస్సులు దేశ ప్రజలకు అన్ని ప్రయత్నాల్లో మార్గనిర్దేశనం చేస్తూనే ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ (X) వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
‘అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రభు శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి. మన అన్ని ప్రయత్నాలలో ఆ స్వామి మనకు మార్గనిర్దేశనం చేస్తుంటారు’ అని ప్రధాని పోస్ట్ చేశారు. కాగా ప్రధాని మోదీ ఇవాళ రామేశ్వరాన్ని సందర్శించనున్నారు. అక్కడి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అద్భుతమైన ఇంజినీరింగ్ టెక్నాలజీతో నిర్మించిన పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.
सभी देशवासियों को रामनवमी की ढेरों शुभकामनाएं। प्रभु श्रीराम के जन्मोत्सव का यह पावन-पुनीत अवसर आप सबके जीवन में नई चेतना और नया उत्साह लेकर आए, जो सशक्त, समृद्ध और समर्थ भारत के संकल्प को निरंतर नई ऊर्जा प्रदान करे। जय श्रीराम!
— Narendra Modi (@narendramodi) April 6, 2025