చండీఘడ్: నూతనంగా తీసుకువచ్చిన మూడు నేర చట్టాలను(Criminal Laws) జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఇవాళ చండీఘడ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియమ్ చట్టాలను జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అండ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు చట్టాలను ఇటీవల కేంద్ర సర్కారు రద్దు చేసింది.
కొత్త మూడు న్యాయ చట్టాలను వంద శాతం అమలు చేసిన నగరంగా చండీఘడ్ నిలిచింది. ఈ నేపథ్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలు, ప్రాముఖ్యతకు లోటు రాకుండా భారతీయ న్యాయ సంహిత రూపొందించినట్లు ప్రధాని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆశయాల దిశగా అడుగులు వేసేందుకు కొత్త క్రిమినల్ చట్టాలను ఉపయోగపడుతాయన్నారు. కొత్త చట్టాలతో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. డిజిటల్ ఆధారాలు, టెక్నాలజీ ఏకీకరణతో.. ఉగ్రవాదంపై పోరాడేందుకు సులువు అవుతుందని, ఉగ్రవాదులు.. ఉగ్ర సంస్థలు తప్పించుకోలేని రీతిలో కొత్త చట్టాలు పకడ్బందీగా ఉన్నట్లు ప్రధాని తెలిపారు.
గతంలో ఉన్న క్రిమినల్ చట్టాలు భారతీయుల్ని శిక్షించాలన్న ఉద్దేశంతో ఉన్నాయని, వాళ్లను బానిసలుగా చూసే విధంగా చట్టాలను ఉన్నట్లు చెప్పారు. బానిసల కోసం చట్టాలను మనం ఎందుకు అమలు చేయాలని ప్రధాని ప్రశ్నించారు. బ్రిటీష్ కాలం నాటి మైండ్సెట్ నుంచి దేశ ప్రజలు బయటపడాలన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah inspect an exhibition on the implementation of the new criminal laws, in Chandigarh.
(Video: DD) pic.twitter.com/sWfFloWH5E
— ANI (@ANI) December 3, 2024