తిరువనంతపురం: కేరళలో కొత్తగా నిర్మించిన విజిన్జమ్ బహుళ ప్రయోజనాల పోర్టు(Vizhinjam Seaport)ను జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సుమారు 8900 కోట్ల ఖర్చుతో విజిన్జమ్ ఇంటర్నేషనల్ డీప్వాటర్ మల్టీపర్పోజ్ సీపోర్టును నిర్మించారు. కేరళ సర్కారు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావించింది. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్మించారు. అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ భాగస్వామ్యం ఉన్నది. పోర్టు కమీషనింగ్ సందర్భంగా జరిగిన వేడుకలో గౌతమ్ అదానీ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీని ఆయన సన్మానించారు.
#WATCH | Thiruvananthapuram, Kerala: Prime Minister Narendra Modi dedicates to the nation ‘Vizhinjam International Deepwater Multipurpose Seaport’ worth Rs 8,900 crore
CM Pinarayi Vijayan is also present at the event. This ambitious project of the Kerala government has been… pic.twitter.com/t5bbfMuIUq
— ANI (@ANI) May 2, 2025
విజిన్జమ్ పోర్టు శిల్పి సీఎం పినరయి విజయన్ అని మంత్రి వీఎన్ వాసన్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది వచ్చే 22 కోట్ల డాలర్ల నష్టాన్ని ఈ పోర్టు పూడ్చివేయగలదని సీఎం విజయన్ పేర్కొన్నారు. గతంలో సదుపాయాలు లేకపోవడం వల్ల 75 శాతం కంటేనర్ కార్గోలను విదేశాల ద్వారా మళ్లించేవాళ్లమని, ఇప్పుడు ఆ సమస్య ముగుస్తుందని, ఇది దేశానికి గర్వకారణమని సీఎం విజయన్ అన్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2045లో ముగియాలని, కానీ దశాబ్ధ కాలం ముందే ప్రాజెక్టు ముగిసినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే 250 నౌకలు పోర్టుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
#WATCH | Thiruvananthapuram: During the inauguration event of Vizhinjam port, Kerala CM Pinarayi Vijayan says, “Government of Kerala and on my own behalf, I extend a warm welcome to the Prime Minister Narendra Modi who is here to inaugurate the port. This is a proud moment for… pic.twitter.com/0OfwP06kwI
— ANI (@ANI) May 2, 2025