Vijaykanth | ఆయనో లెజెండ్.. విజయకాంత్ మృతిపట్ల మోదీ సంతాపం
Vijaykanth | తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం బాధాకరం. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయనో లెజెండ్ అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Vijaykanth | న్యూఢిల్లీ : తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం బాధాకరం. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయనో లెజెండ్. తన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. తమిళనాడు రాజకీయాలను విజయకాంత్ ఎంతో ప్రభావితం చేశారు. నాకు మంచి మిత్రుడు.. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. విజయకాంత్ కుటుంబానికి, అభిమానులకు, అనుచరులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
రాహుల్ తీవ్ర దిగ్భ్రాంతి
తమిళ నటుడు విజయకాంత్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో విజయకాంత్ విశేష సేవలందించి, లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను అని రాహుల్ తన ట్వీట్లో తెలిపారు.
Extremely saddened by the passing away of Thiru Vijayakanth Ji. A legend of the Tamil film world, his charismatic performances captured the hearts of millions. As a political leader, he was deeply committed to public service, leaving a lasting impact on Tamil Nadu’s political… pic.twitter.com/di0ZUfUVWo
— Narendra Modi (@narendramodi) December 28, 2023
Deeply saddened by the demise of DMDK founder, Thiru Vijayakanth ji.
His contributions to cinema and politics have left an indelible mark on the hearts of millions. My heartfelt condolences to his family and fans during this difficult time.
— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

