Modi Cabinet | న్యూఢిల్లీ : వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఆ 71 మంది కూడా నిన్న మోదీతో పాటు ప్రమాణం చేశారు. తన కేబినెట్లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. 71 మందిలో 30 మంది కేబినెట్ మంత్రులుగా, 36 మంది సహాయ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర మంత్రులు ఉన్నారు. ఇక బీజేపీ ఎంపీలకే కీలకమైన శాఖలను కట్టబెట్టారు. హోం, రక్షణ, ఆర్థిక, వైద్యారోగ్య, వ్యవసాయం, విదేశాంగ, రైల్వేస్, పార్లమెంటరీ వ్యవహరాలు, ఇంధన శాఖలను బీజేపీ ఎంపీలకే కేటాయించారు.
సిబ్బంది వ్యవహారాలు, పించన్లు, పబ్లిక్ గ్రీవెన్స్, అణు శక్తి, అంతరిక్షం, కీలక విధాన సంబంధిత అంశాలతోపాటు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు.
రాజ్నాథ్ సింగ్ – రక్షణ శాఖ
అమిత్ షా – హోం మంత్రిత్వ, సహకార శాఖ
నితిన్ గడ్కరీ – రోడ్లు, జాతీయ రహదారులు
జేపీ నడ్డా – ఆరోగ్య, సంక్షేమం; రసాయనాలు, ఎరువులు
శివరాజ్ సింగ్ చౌహాన్ – వ్యవసాయం, రైతు సంక్షేమం; గ్రామీణాభివృద్ధి
నిర్మలా సీతారామన్ ఆర్థికం; కార్పొరేట్ వ్యవహారాలు
సుబ్రహ్మణ్యం జైశంకర్ – విదేశీ వ్యవహారాలు
ధర్మేంద్ర ప్రధాన్ – విద్య
అశ్వినీ వైష్ణవ్ – రైల్వే, సమాచార – ప్రసారాలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
కిరణ్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు
కిషన్ రెడ్డి – బొగ్గు, గనులు