భువనేశ్వర్: ఒడిశాకు చెందిన గిరిజన కవియిత్రి పూర్ణమాసి జానికి .. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పాదాభివందనం చేశారు. రాష్ట్రంలోని ఖందమాల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. స్టేజ్‌పై పద్మశ్రీ పూర్ణమాసి జానిని సన్మానించారు. ఆ తర్వాత ఆమె పాదాలకు మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు. 80 ఏళ్ల పూర్ణమాసి జాని ఓ కవి, సామాజిక కార్యకర్త. ఆమె సుమారు 50 వేల భక్తి పాటలు రాశారు. ఒడియా, కుయి, సంస్కృతం భాషాల్లో ఆమె ఆ పాటల్ని కంపోజ్ చేశారు. గిరిజన సంస్కృతి, కళల కోసం శ్రమించిన పూర్ణమాసికి 2021లో పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆమెను పాపులర్‌గా తడిసోరు భాయి అని పిలుస్తారు.
సభలో మోదీ మాట్లాడుతూ.. జగన్నాథ ఆలయంలోని రత్నభండార్కు చెందిన తాళంచెవులు కనిపించకుండాపోయి ఆరేళ్లు అవుతోందని, ఆ తాళంచెవి ఎవరికి దొరికిందని, దాంతో ఆ రత్నభండారాన్ని ఓపెన్ చేస్తున్నారని అని ప్రశ్నించారు. రత్నభండార్కు చెందిన డూప్లికేట్ తాళాలు దొరికినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, అసలు ఎందుకు డూప్లికేట్ కీని తయారు చేశారని, కీ పోగొట్టుకోవడం సీరియస్ సమస్య అని, ఇక డూప్లికేట్ చేయడం మరీ సీరియస్ సమస్య అని మోదీ అన్నారు.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయం అని మోదీ తెలిపారు. తొలిసారి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడబోతోందన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi felicitates Padma Shri awardee Purnamasi Jani & seeks blessings by teaching her feet, during his public meeting in Odisha’s Kandhamal. pic.twitter.com/sWjRAt69Jz
— ANI (@ANI) May 11, 2024