PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఫ్రాన్స్ (France)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పారిస్‌లో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా భారత అమరవీరులకు మోదీ నివాళులర్పించారు.
మొదటి ప్రపంచ యుద్ధం (World War)లో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్‌లో (Marseilles) గల మజార్గ్యుస్ వార్ శ్మశానవాటికలో (Mazargues War Cemetery) యుద్ధ స్మారకం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ యుద్ధ స్మారకాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron)తో కలిసి మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా భారత అమరవీరులకు నివాళులర్పించారు. పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం మార్సెయిల్స్‌లో భారత కాన్సులేట్‌ను మెక్రాన్‌తో కలిసి ప్రారంభించారు.
Also Read..
Pariksha Pe Charcha | అప్పుడు బతకాలనుకోలేదు.. అమ్మను పట్టుకుని ఏడ్చేశా : దీపికా పదుకొణె
Freebies: ఎన్నికలకు ముందు ఉచిత వాగ్ధానాలు.. ఆ వైఖరిని తప్పుపట్టిన సుప్రీంకోర్టు