న్యూఢిల్లీ, జూన్ 12: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామి డిమాండు చేశారు. 1956లో అరియలూరు రైలు ప్రమాదం జరిగిన తర్వాత అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిన ఉదంతాన్ని ఆయన ఉదహరించారు.
అదే నైతికతతో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు. మోదీ, ఆయన సహచరులు ప్రస్తుతం సాగిస్తున్న తిరుగుళ్లు ఇక వెంటనే కట్టిపెట్టాలని కూడా ఆయన డిమాండు చేశారు.