PM KISAN : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN)’ స్కీమ్ కింద 19వ విడత నిధులను విడుదల చేశారు. బీహార్ (Bihar) రాష్ట్రంలోని భాగల్పూర్ (Bhagalpur) లో జరిగిన సమావేశం నుంచి ఈ నిధుల విడుదల జరిగింది. ఈ ఏడాది ఆఖరులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ నిధుల విడుదలకు బీహార్‌ను వేదికగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ప్రధాని విడుదల చేసిన పీఎం కిసాన్ నిధులతో దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 19వ విడత పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రధాని మొత్తం రూ.22,700 కోట్ల నిధులను విడుదల చేశారు. కాగా, ప్రధాని పర్యటన నేపథ్యంలో బీహార్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భాగల్పూర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, సీనియర్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ప్రధాని సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, బీహార్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
#WATCH | PM Narendra Modi releases the 19th instalment of PM Kisan Samman Nidhi Yojana and inaugurates & dedicates to the nation various development projects, from Bhagalpur in Bihar.
(Video: DD) pic.twitter.com/OkJrrv2NQu
— ANI (@ANI) February 24, 2025