న్యూఢిల్లీ: ఈనెల 18న 17వ విడత పీఎం కిసాన్ నిధులు జమ చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేస్తారని తెలిపారు. వ్యవసాయ పద్ధతుల్లో రైతులకు సహకారాన్ని అందించేందుకు ‘కృషి సఖీ’లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 30 వేల మందికి సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.