Bus Caught Fire | రాజస్థాన్లో మంగళవారం ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. ప్రయాణికులు సజీవదహనమైన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన మోడీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతులకు సంతాపం తెలిపిన ఆయన బాధిత కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామని పేర్కొన్నారు.
‘రాజస్థాన్లోని జైపూర్లో ప్రైవేట్ బస్సుకు మంటలంటుకొని ప్రయాణికులు చనిపోవడం బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధితులు కటుంబాల గురించి ఆలోచిస్తున్నాను. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నా. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వాళ్లకు రూ. 50 వేలు నష్టపరిహారంగా అందిస్తాం’ అని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ ప్రమాదంలో సజీవదహనం అయిన ప్రయాణికులు మృతదేహాలను డీఎన్ఏ టెస్టింగ్ ఆధారంగా గుర్తించనున్నారు.
Jaisalmer bus fire | PM Modi announces an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased. The injured would be given Rs. 50,000. pic.twitter.com/0Oie2G49JO
— ANI (@ANI) October 14, 2025
జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సును డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపాడు. కాసేపటికే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 19 మంది సజీవ దహనం కాగా.. తీవ్రమైన గాయాలైన వారిని జోధ్పూర్కు తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో 57 మంది ఉన్నట్టు సమాచారం. థైయత్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘోర ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.