Mamata Banerjee : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) విషయంలో కేంద్ర ప్రభుత్వం (Union Govt) వ్యవహరిస్తున్న తీరుపై పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister) మమతా బెనర్జి (Mamata Banerjee) ఘాటుగా స్పందించారు. మత రాజకీయాలు చేయడం మానుకుని, దేశ సరిహద్దులను జాగ్రత్తగా కాపాడుకోవాలని కేంద్ర సర్కారుకు సూచించారు. దేశంపట్ల జాగురుకత అవసరమని అన్నారు. మనం దేశాన్ని ప్రేమిస్తున్నామని, ఎలాంటి విపత్తు జరగకుండా దేశాన్ని కాపాడుకోవాలని ఆమె సలహా ఇచ్చారు.
పహల్గాం ఉగ్రదాడిలో తమ ఆప్తులను కోల్పోయి బాధలో ఉన్నవారికి న్యాయం చేయాలని మమతా బెనర్జి డిమాండ్ చేశారు. మురికి రాజకీయాలు చేయవద్దని, తాను మురికి రాజకీయాలను ఏమాత్రం సహించబోనని మమత హెచ్చరించారు. తాను 10 నుంచి 12 మంది ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశానని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రధాని మతకల్లోలాలు సృష్టించడంపై శ్రద్ధ పెట్టడం మానుకుని, సరిహద్దులపై శ్రద్ధ పెట్టాలని అన్నారు.
తాను ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, దేశంలో యాక్టివ్ ప్రధాని మంత్రి ఎవరో బీజేపీ నేతలు చెబుతున్నారని, ఆయన ప్రధాని పీఠంపై కూర్చున్నా దేశ ప్రజలను విడదీయలేరని అమిత్ షా వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి మమతా బెనర్జి ఈ వ్యాఖ్యలు చేశారు.