ఆదివారం 29 మార్చి 2020
National - Feb 10, 2020 , 06:35:49

మొక్కలే మానవాళికి జీవనాధారం..

మొక్కలే మానవాళికి జీవనాధారం..

గుజరాత్‌: మొక్కలే మానవాళికి జీవనాధారమనీ, నేటి మొక్కలే రేపటి వృక్షాలుగా తయారై, యావత్‌ జీవకోటికి ఆక్సిజన్‌ అందిస్తాయని అర్బన్‌ ఫారెస్ట్రీ ఓఎస్‌డీ క్రిష్ణ అన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఆయన గుజరాత్‌లోని కేవదీయలో గల స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ, ఆరోగ్యవన్‌ ప్రాంగణంలో కాళేశ్వరం ప్రధాన ఇంజనీర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మహత్తరమైనదిగా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారాయన. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి చాలా అవసరం.  ప్రకృతిని కాపాడుకొని, ప్రకృతితో మమేకమైతే ఎలాంటి విపత్తులు సంభవించవని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీని బండ, టీఎస్‌ఐఐసీ సీఈవో మధుసూదన్‌ సహా అన్ని హరిత హోటళ్ల మేనేజర్లు, పర్యాటక శాఖ విభాగాధిపతులు మొక్కలు నాటాలని కోరారు. 


logo