న్యూఢిల్లీ: విమాన పైలట్లుగా శిక్షణ, లైసెన్స్ పొందే అవకాశం ఆర్ట్స్, కామర్స్ చదివిన వారికీ రాబోతున్నది. పైలట్ శిక్షణ అర్హతల నుంచి పన్నెండో తరగతిలో భౌతిక శాస్త్రం, గణితం చదివి ఉండాలనే నిబంధనను తొలగించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) యోచిస్తున్నది. ఈమేరకు కేంద్ర విమానయాన శాఖకు సిఫారసు చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఫ్లయింగ్ స్కూల్స్‌కు ర్యాంకింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కూడా డీజీసీఏ యోచిస్తున్నది. కమర్షియల్ పైలట్ లైసెన్స్ పూర్తి చేయడానికి అవసరమైన ఫ్లయింగ్ సమయం, భద్రత వంటి అంశాలను ఈ విధానం పరిగణనలోకి తీసుకుంటుంది. విమానయాన పరిశ్రమకు సిబ్బంది అవసరం పెరుగుతుండటంతో పైలట్ శిక్షణ విధానాన్ని సంస్కరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.