న్యూఢిల్లీ: ఫిజియోథెరపిస్టులు మెడికల్ డాక్టర్లు కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) తెలిపింది. ఫిజియోథెరపిస్టులు తమ పేర్ల ముందు డాక్టర్ అనే పదాన్ని రాసుకోకూడదని పేర్కొంది. డీజీహెచ్ఎస్ డాక్టర్ సునీత శర్మ ఈ నెల 9న విడుదల చేసిన లేఖలో, ఫిజియోథెరపిస్టులు డాక్టర్ అనే టైటిల్‌ను ఉపయోగించుకోవడం ఇండియన్ మెడికల్ డిగ్రీస్ యాక్ట్, 1916ను ఉల్లంఘించడం అవుతుందని తెలిపారు.
ఫిజియోథెరపిస్టులు రోగుల వ్యాధిని నిర్ధారణ చేయడానికి తగిన శిక్షణ పొందినవారు కాదని, వారు ప్రైమరీ కేర్ ప్రాక్టీస్‌ను చేపట్టరాదని వివరించారు. వైద్యులు పంపించిన రోగులకు మాత్రమే చికిత్స చేయాలని పేర్కొన్నారు.