తిరువనంతపురం : కేరళ ట్రాఫిక్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ ఎలక్ట్రిక్ వెహికల్‌కు పొల్యూషన్ సర్టిఫికెట్ పేరిట చలాన్ విధించారు. ప్రస్తుతం ఈ చలాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలోని మలప్పురం జిల్లాలోని నీలాన్చెరి ఏరియాలో ఓ ఎలక్ట్రిక్ టూ వీలర్‌కు ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ఎందుకంటే ఆ వెహికల్‌కు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేదని చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు గానూ రూ. 250 జరిమానా విధించారు.
మోటార్ వెహికల్ చట్టం 1998లోని సెక్షన్ 213(5)(e) ప్రకారం చలాన్ జారీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి నెటిజన్లు విజ్ఞప్తి చేశారు.