Ranabali | రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటిస్తున్న సినిమా కావడంతో.. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ మంచి స్పందన అందుకోగా.. తాజాగా మేకర్స్ మరో కీలక అప్డేట్ ఇచ్చారు. సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘రణబాలి’ టీజర్ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా కావడంతో టీజర్లో విజయ్ దేవరకొండను ఎలాంటి లుక్‌లో చూపించబోతున్నారు? ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? సినిమాలోని యాక్షన్ ఎలిమెంట్స్ ఏ స్థాయిలో ఉంటాయి? అనే విషయాలపై ఇప్పుడు ఆసక్తి పెరిగింది. ఫస్ట్ లుక్‌తో సినిమాకు మంచి బజ్ వచ్చిన నేపథ్యంలో టీజర్ ఈ హైప్‌ను మరింత పెంచుతుందని అభిమానులు భావిస్తున్నారు.
‘రణబాలి’కి ఉన్న ప్రత్యేక ఆకర్షణల్లో విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నా జోడీ కూడా ఒకటి. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పెళ్లి తర్వాత మరోసారి జంటగా కనిపించనుండటంతో.. ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, కెమిస్ట్రీ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఇది కేవలం రొమాంటిక్ ఎంటర్టైనర్ కాకుండా పీరియడ్ యాక్షన్ డ్రామా కావడంతో.. రష్మిక పాత్ర కూడా కథలో కీలకంగా ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకుల్లో కూడా ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు హిందీలోనూ విడుదలైనప్పటికీ.. ‘అర్జున్ రెడ్డి’ స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి.ఈ నేపథ్యంలో ‘రణబాలి’తో విజయ్ దేవరకొండకు సిసలైన పాన్ ఇండియా సక్సెస్ దక్కుతుందని చిత్రబృందం నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. కథ, పీరియడ్ బ్యాక్‌డ్రాప్, యాక్షన్ ఎలిమెంట్స్, భారీ నిర్మాణ విలువలు అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.