Delhi Blast | ఢిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో డాక్టర్ షాహీన్, ముజమ్మిల్ (Muzammil)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, వారికి సంబంధించిన ఓ కొత్త ఫొటో తాజాగా బయటకు వచ్చింది.
వీరిద్దరూ కలిసి ఓ కారును కొనుగోలు చేశారు. సెప్టెంబర్ 25న ఒక షోరూమ్‌లో మారుతి సుజుకి బ్రెజా కారును కొనుగోలు చేశారు. అయితే, ఆ సమయంలో వారు మొత్తం నగదు రూపంలో చెల్లించి కారును తీసుకెళ్లినట్లు బయటపడింది. పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు సిద్ధం చేస్తున్న 32 కార్లలో ఇది కూడా ఒకటని దర్యాప్తు అధికారులను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
కాగా, డిసెంబర్ 6న ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తేలిన విషయం తెలిసిందే. మొత్తం 32 వాహనాల్లో పేలుడు పదార్థాలను నింపాలని అనుమానిత ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. మొత్తం 8 మంది అనుమానితులు సుమారు నాలుగు లొకేషన్లలో పేలుడుకు పాల్పడాలని భావించినట్లు తెలుస్తున్నది. పేలుడు పదార్ధాలను కొనుగోలు చేసేందుకు వైట్‌కాలర్ డాక్టర్లు సుమారు 26 లక్షల నిధి సేకరించినట్లు తేలింది.
Also Read..
Ambulance Catches Fire | మంటల్లో అంబులెన్స్.. నవజాత శిశువు, వైద్యుడు సహా నలుగురు సజీవదహనం
Narayana Murthy | చైనా ఫార్ములాలో.. యువత 72 గంటలు పనిచేయాలి : ఇన్ఫీ నారాయణమూర్తి
Delhi Blast | ఆత్మాహుతి దాడిని సమర్థించిన డాక్టర్ ఉమర్ నబీ.. వెలుగులోకి సంచలన వీడియో