న్యూఢిల్లీ : ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఇటీవలి పరిణామాలపై జెలెన్స్కీ అభిప్రాయాలను తెలుసుకున్నట్లు మోదీ ఎక్స్‌లో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సత్వరం, శాంతియుతంగా పరిష్కారం కావాలనే భారత దేశ సడలని వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లు చెప్పారు.