Petrol prices | న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు త్వరలో తగ్గవచ్చు! ఎన్డీయే కూటమికి అత్యంత కీలకమైన మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూలు వచ్చే నెలలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎల్ఎస్ఏ అంచనా ప్రకారం, వచ్చే నెల 5 తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉంది.
పెట్రోలియం, సహజ వాయువు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ గత నెలలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు నిలకడగా కొనసాగితే ధరలను తగ్గించే అంశాన్ని ఆయిల్ కంపెనీలు పరిశీలించవచ్చునని ఆయన చెప్పారు.