మంగళవారం 19 జనవరి 2021
National - Dec 05, 2020 , 14:31:37

వాహనదారులకు షాక్: మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

వాహనదారులకు షాక్: మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. దేశీ ఇంధన ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి వెళ్ళాయి. గతనాలుగు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడం గమనార్హం. పెట్రోల్ ధర 28 పైసలు, డీజిల్ ధర 27 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌‌లో ఈరోజు పెట్రోల్ ధర రూ.86.46కు, డీజిల్ ధర రూ.80కు చేరాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.70 శాతం పెరుగుదలతో 49.05 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.99 శాతం పెరుగుదలతో 46.09 డాలర్లకు ఎగసింది.

సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర పెరిగింది. 27 పైసలు పెరుగుదలతో రూ.83.13కు చేరుకున్నది. డీజిల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.73.32కు ఎగసింది. ముంబైలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.89.78కు చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.79.93కు ఎగసింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.