కేంద్రం పరిహారం ఇస్తే రాష్ర్టాలెందుకు ఒప్పుకోవు?
కోల్కతా: చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ర్టాలు సుముఖంగా లేనందువల్లే వాటి ధరలు పెరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. ‘పెట్రోల్ తగ్గించడానికి మీరు సుముఖమేనా? అనేది మీ ప్రశ్న అయితే అవుననే సమాధానమిస్తాను.. మరి ఎందుకు తగ్గడం లేదని అంటే దానిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ర్టాలు ఇష్టపడకపోవడమేనని చెప్పాలి’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారాయన. అయితే కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లిస్తే రాష్ర్టాలు ఎందుకు అంగీకరించవు? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాష్ర్టాలపైకి నెపం నెట్టేందుకే… పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ర్టాలు అంగీకరించడం లేదని కేంద్రం చెబుతున్నదని విమర్శిస్తున్నారు.