Petro rates | వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన నయారా..!
Petro rates | దేశంలోని వాహనదారులకు నయారా ఎనర్జీ (Nayara Energy) భారీ ఊరట కల్పించింది. పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలను తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5, డీజిల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున కోత విధించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా నయారా రిటైల్ ఔట్లెట్ల (Nayara Retail Oulets) లో ఈ తగ్గిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.
Petro rates : దేశంలోని వాహనదారులకు నయారా ఎనర్జీ (Nayara Energy) భారీ ఊరట కల్పించింది. పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలను తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5, డీజిల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున కోత విధించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా నయారా రిటైల్ ఔట్లెట్ల (Nayara Retail Oulets) లో ఈ తగ్గిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. గత రెండేళ్లలో దేశంలో ఒక ఇంధన రిటైల్ సంస్థ ధరలను తగ్గించడం ఇదే తొలిసారి. పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు చల్లారడం, కీలకమైన సముద్ర మార్గాలు తిరిగి తెరుచుకోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఈ నేపథ్యంలోనే నయారా ఎనర్జీ పెట్రో ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రాల వారీగా ఉండే వ్యాట్ వంటి స్థానిక పన్నుల కారణంగా తుది రిటైల్ ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. నయారా ధరలను తగ్గించినప్పటికీ, ప్రభుత్వరంగ చమురు సంస్థలు మాత్రం పాత ధరలనే కొనసాగిస్తున్నాయి. దేశంలోని 90 శాతానికిపైగా ఇంధన మార్కెట్‌ను నియంత్రించే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్ ) తమ ధరలలో ఎటువంటి మార్పు చేయలేదు.
ఢిల్లీలోని ఐఓసీ బంకుల్లో పెట్రోల్ లీటర్ రూ.102.12, డీజిల్ రూ.95.20 వద్ద స్థిరంగా ఉన్నాయి. కాగా ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో మార్చి 26న నయారా పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచింది. తాజా తగ్గింపుతో ఆ పెంపును పూర్తిగా వెనక్కి తీసుకున్నట్లయింది. మరోవైపు మే నెల ద్వితీయార్థంలో ప్రభుత్వ రంగ సంస్థలు పలు దఫాలుగా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.7.50 చొప్పున పెంచడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

