Hardeep Singh Puri | న్యూఢిల్లీ, జనవరి 3: పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ.. ప్రస్తుతం ప్రపంచ ఆయిల్ మార్కెట్ దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదలపై ఆయిల్ కంపెనీలతో ఇప్పటివరకు చర్చించలేదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న రెండు యుద్ధాలు (రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్), ఎర్ర సముద్రంలో నౌకలపై దాడి తదితర పరిణామాలు కూడా పెట్రోల్, డీజిల్పై ప్రభావం చూపనున్నాయి. పరిస్థితులు సద్దుమణిగితే ఇంధన ధరలు తగ్గింపు ఉంటుంది’ అని పేర్కొన్నారు.