Petrol Price | దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు సగటున రూ.3 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.
పెరిగిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.77, డీజిల్ రూ.90.67కి పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.3.39, డీజిల్‌పై రూ.3.26 వరకు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.110.89, డీజిల్ ధర రూ.98.96కి చేరింది. ఏపీలో పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ.106.68, డీజిల్ ధర రూ.95.13కి చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.10.3.67, డీజిల్ ధర రూ.95.25కి పెరిగింది.

Petrol Price
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఆయిల్ కంపెనీలపై భారం పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రధాని మోదీ పొదుపు మంత్రం పాటించాలని చెప్పిన రెండు మూడు రోజుల్లోనే ఈ ధరలు పెరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తద్వారా నిత్యవసర వస్తువుల ధరలు, ప్రయాణచార్జీలు తదితర రంగాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.