Petrol price : వాహనదారులకు కాంగ్రెస్ సర్కారు షాకిచ్చింది. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఈ మేరకు పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్ పెంచినట్టు కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు శనివారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రభుత్వ నోటిఫికేషన్ అందుకున్న ‘అఖిల కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్’.. నోటిఫికేషన్‌కు అనుగుణంగా పెట్రో రేట్లను సవరించినట్లు వెల్లడించింది.
ప్రభుత్వం పెట్రోల్‌పై 25.92 శాతంగా ఉన్న సేల్స్ ట్యాక్స్‌ను 29.84 శాతానికి, అదేవిధంగా డీజిల్‌పై 14.3 శాతంగా ఉన్న సేల్స్ ట్యాక్స్‌ను 18.4 శాతానికి పెంచిందని ‘అఖిల కర్ణాటక పెట్రోలియం డీలర్స్ అసోషియేషన్’ తెలిపింది. సేల్స్ ట్యాక్స్ పెంపు కారణంగా బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.85కు, లీటర్ డీజిల్ ధర రూ.88.93కు పెరిగింది. అంతకుముందు లీటర్ పెట్రోల్ ధర రూ.99.84, లీటర్ డీజిల్ ధర రూ.85.93 గా ఉండేది.