ముంబై: తనపై చేతబడి చేశారని, శారీరకంగ, మానసికంగా వేధించడంతోపాటు బలవంతంగా ఆవు మూత్రం తాగించినట్లు ఒక మహిళ ఆరోపించింది. పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, ఆయన కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. (Sena UBT leader) మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నేత, మాజీ ఎంపీ వినాయక్ రౌత్, కోడలు గిరిజ పలు ఆరోపణలు చేశారు. మామ, భర్త తనను శారీరకంగా, మానసికంగా హింసించారని, తనతో బలవంతంగా గోమూత్రం తాగించారని ఆమె ఆరోపించింది. అంతేగాక తనపై చేతబడి చేశారని, ఫిరోజ్ బాబా, ఖాజీ బాబా అనే ఇద్దరు క్షుద్ర మాంత్రికులతో క్షుద్ర పూజలు చేయించారని, దీని కోసం తన తల నుంచి వెంట్రుకలను వారు పీకారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.
కాగా, శివసేన (యూబీటీ) నేత, మాజీ ఎంపీ వినాయక్ రౌత్ కోడలు గిరిజ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆ నేతతో పాటు భర్త అయిన ఆయన కుమారుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.