భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ నదిపై బ్రిడ్జి కడుతున్నారు. నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పిల్లర్‌పై చిక్కుకుపోయిన కార్మికులను స్థానికులు రక్షించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాగర్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. అయితే జిల్లాలో ఉన్న ఓ నదిపై వంతెన నిర్మాణంలో ఉన్నది. కార్మికులు వారిపనుల్లో నిమగ్నమై ఉన్నారు. నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పిల్లర్‌పైకి ఎక్కిన కార్మికులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే స్థానికులు రెండు పిల్లర్ల మధ్య రెండు తాళ్లు కట్టారు. దీంతో కార్మికులు వాటి సాయంతో ఒక్కొక్కరిగా అక్కడి నుంచి బయటపడ్డారు. అంతకు ముందు నదిలో చిక్కుకున్న నలుగురు పిల్లలను స్థానికులు రక్షించారు.
#WATCH | Madhya Pradesh: People who were stuck on an under constructed bridge in Sagar walked on rope to rescue themselves after water level rose in the river (10.06) pic.twitter.com/d5IWoNQNVO
— ANI (@ANI) June 11, 2021