JK Elections | జమ్ముకశ్మీర్‌లో ప్రశాంతంగా రెండో విడత పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు.. Video
JK Elections | జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. రెండో విడతలో భాగంగా పీర్‌పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసి జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
JK Elections : జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. రెండో విడతలో భాగంగా పీర్‌పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసి జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
రెండో విడత పోలింగ్ జరుగుతున్న 26 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 239 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి భవితవ్యాన్ని 25.78 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. రెండో విడత ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నారు.
మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 18న 24 నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్‌లో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మిగిలిన 40 స్థానాలకు తుది విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
#WATCH | J&K: People queue up at a polling station in Budgam Assembly constituency to vote in the second phase of the Assembly elections today.
Eligible voters in 26 constituencies across six districts of the UT are exercising their franchise today.
(Visuals from polling… pic.twitter.com/ZhaBRFmUSa
— ANI (@ANI) September 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

