కోల్కతా: బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులకు ‘ఉపాధి హామీ’ సెగ తగులుతున్నది. ఉపాధి బకాయిలను కేంద్రంలోని బీజేపీ సర్కారు చెల్లించకపోవడంపై బెంగాల్ ప్రజలు రాష్ట్ర బీజేపీ నేతలను నిలదీస్తున్నారు.
రాష్ర్టానికి విడుదల చేయాల్సిన నిధుల్ని మోదీ సర్కార్ విడుదల చేయటం లేదన్న ఆగ్రహం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది. కూచ్ బెహార్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యే బారెన్ చంద్రబర్మన్కు వ్యతిరేకంగా సితాల్కుంచ్ నియోజకవర్గ ప్రజలు ఆదివారం నిరసనకు దిగారు. ‘ఉపాధి హామీ’ పథకం బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆయన్ని ఘొరావ్ చేశారు.