న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా, ఫలితం ఉండటం లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం చెప్పారు. ప్రజలకు చట్టం పట్ల గౌరవం, భయం లేవని వ్యాఖ్యానించారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. తాను కూడా రోడ్డు ప్రమాద బాధితుడినేనని అన్నారు. హెల్మెట్లు ధరించకపోవడం వల్ల 30 వేల మంది మరణించారని చెప్పారు. ఈ సంవత్సరం 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని పేర్కొన్నారు.