రాయ్‌పూర్: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఇన్నాళ్లు ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని ఆరోపించారు. ప్రజల మెదళ్లలోకి బలవంతంగా హింస, విధ్వంసాలను చొప్పించిందని మండిపడ్డారు.
కానీ, ఇప్పుడు సమాజంలో క్రమంగా మార్పు వస్తుందన్నారు. దేశంలో ధరలు పెరుగుదల, నిరోద్యోగం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారని చెప్పారు. దాంతో విభేదాలను పక్కనపెట్టి ప్రజలంతా ఏకతాటిపైకి వస్తున్నారని పేర్కొన్నారు. అందుకే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రకు కోట్లాది మంది తరలివస్తున్నారని బఘేల్ చెప్పారు.