Cancer | హైదరాబాద్, జూలై 6 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మగవారిలో అరుదుగా కనిపించే పురుషాంగ క్యాన్సర్ కేసులు ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐరోపా, అమెరికాలో ఈ కేసుల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి పురుషాంగ క్యాన్సర్ కేసుల్లో పెరుగుదల 77 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 50 ఏండ్లు పైబడినవారిలో ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్.. ముఖ్యంగా పురుషాంగం ముందటి చర్మం అపరిశుభ్రంగా ఉండటం, ధూమపానం తదితర కారణాల వల్ల వస్తుంటుంది. కీమోథెరపీ, రేడియో థెరపీ లేదా లేజర్ ట్రీట్మెంట్ సాయంతో ఈ క్యాన్సర్‌ను కొంత వరకు కట్టడి చేయవచ్చని పరిశోధకులు చెప్తున్నారు.