Pench Tiger Reserve | ముంబై: దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్(కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవి)గా మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ (పీటీఆర్) అరుదైన గుర్తింపు సాధించింది. ఆసియాలో ఇది ఐదోది. ఔత్సాహిక ఖగోళ పరిశోధకులకు ఈ పార్క్ ఎంతో ఉపయోగపడనుంది. కాంతి కాలుష్యం వల్ల అమూల్యమైన వనరులకు ప్రమాదం పొంచి ఉందని పీటీఆర్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభునాథ్ శుక్లా తెలిపారు. కాంతి కాలుష్యాన్ని తగ్గించే వీధి దీపాలను బఫర్ ఏరియాలోని గ్రామాల్లో అమర్చామని తెలిపారు.