ఇటానగర్, జూన్ 12: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో ఆయనను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
గురువారం ఖండూ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా కోరునున్నట్టు తెలుస్తున్నది. 44 ఏండ్ల పేమా ఖండూ 2016 జూలై నుంచి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.