Mehbooba Mufti | జమ్ముకశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన మెహబూబా ముఫ్తీ
Mehbooba Mufti | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షల పేరుతో పలు అంశాలను ప్రస్తావించారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షల పేరుతో పలు అంశాలను ప్రస్తావించారు. కూటమిగా ఏర్పడిన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు తమ పార్టీ ఎజెండాలను అనుసరిస్తే తాము పోటీకి దూరంగా ఉంటామని మెహబూబా ముఫ్తీ అన్నారు. అప్పుడు 90 స్థానాల్లో వారే పోటీ చేయాలని చెప్పారు. అయితే ఎన్సీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఏ ఎజెండా ఆధారంగా కాదని, కేవలం సీట్ల పంపకం ప్రాతిపదికన జరిగిందని ఆమె విమర్శించారు.
కాగా, పొత్తు, సీట్ల పంపకం చాలా దూరమైన విషయాలని మెహబూబా ముఫ్తీ అన్నారు. ‘నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మా ఎజెండాను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే, అన్ని స్థానాల్లో పోటీ చేయాలని మేం చెబుతాం. వారిని మేం అనుసరిస్తాం. ఎందుకంటే కశ్మీర్ సమస్య పరిష్కారం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ఇంతకు ముందు కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు మాకు ఒక ఎజెండా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్లు అంగీకరించిన ఎజెండా కూడా ఉంది’ అని ఆమె అన్నారు. అయితే కేవలం సీట్ల పంపకంపై మాత్రమే చర్చలు జరిగితే తమ పార్టీ ఏ కూటమిలోనూ చేరదని ముఫ్తీ స్పష్టం చేశారు.
మరోవైపు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని హిందూ తీర్థయాత్ర స్థలమైన శారదా పీఠ్కు వెళ్లే మార్గాన్ని తెరువాలని తమ పార్టీ కోరుకుంటోందని మెహబూబా ముఫ్తీ తెలిపారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 నుంచి నిలిపివేసిన సరిహద్దు వాణిజ్యాన్ని పునరుద్ధరించడం కోసం పాకిస్థాన్తో భారత్ చర్చలు జరుపాలని ఆమె అన్నారు.
#WATCH | J&K: PDP chief Mehbooba Mufti says, "Alliance and seat sharing are faraway things. If the National Conference and Congress are ready to adopt our agenda, we will say they should contest on all seats, we will follow them because for me solving the problem of Kashmir is… pic.twitter.com/nllk8ld225
— ANI (@ANI) August 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

