Sharad Pawar |ముంబై, అక్టోబర్ 20: వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో తాను ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేయనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయడానికి పార్టీ కార్యకర్తలతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాను పోటీ చేయాలంటూ పార్టీ వర్గాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని, అయితే తాను 2009 ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గిన సోలాపూర్ జిల్లా మధ నియోజకవర్గమే కాదు దేని నుంచి కూడా బరిలోకి దిగనని తెలిపారు.