హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కర్ణాటక సీ ఎం సిద్ధరామయ్యతో గురువా రం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనంతరం చేసిన వ్యాఖ్యలు మెగా, అల్లు అభిమానుల మ ధ్య చిచ్చు రాజేశాయి.
ఏపీ, కర్ణాటక మధ్య వన్యప్రాణులు, అటవీ సంరక్షణ, కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకురావడం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం విలేకరులతో పవన్ మాట్లాడుతూ 40 ఏండ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవారని, ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ ఎలా చే యాలో చూపిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమా ర్ నటించిన ‘గందదగుడి’ సినిమాను ప్ర స్తావించిన పవన్.. ఆ సినిమాలో హీరో అ డవులను కాపాడతాడని, కానీ ఇప్పుడు హీరోలు అడవిలో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు తెరలేపాయి.