పౌరసత్వానికి పాస్‌పోర్ట్ ధ్రువీకరణ కాదు.. విదేశాంగ శాఖ స్పష్టం
పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీచేసే పత్రం మాత్రమేనని, అది పౌరసత్వాన్ని ధృవీకరించే నిరూపణ పత్రం కాదని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. భారత పౌరులకు మాత్రమే పాస్‌పోర్టును జారీ చేసినప్పటికీ, అది పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదని పేర్కొన్నది.
న్యూఢిల్లీ : పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీచేసే పత్రం మాత్రమేనని, అది పౌరసత్వాన్ని ధృవీకరించే నిరూపణ పత్రం కాదని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. భారత పౌరులకు మాత్రమే పాస్‌పోర్టును జారీ చేసినప్పటికీ, అది పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదని పేర్కొన్నది. ‘పాస్‌పోర్ట్ సేవా దివస్’ సందర్భంగా విదేశాంగ శాఖ జారీచేసిన ఈ ప్రకటన మరోమారు దేశంలో పౌరసత్వానికి కచ్చితమైన ఆధారాలు ఏవనే అంశంపై చర్చకు దారితీసింది.
ఈ ప్రకటనలో పాస్‌పోర్ట్ అనేది అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడం కోసం ప్రభుత్వం జారీ చేసే ప్రాథమిక ప్రయాణ పత్రం మాత్రమేనని తెలియజేసింది. ఇది భారత ప్రభుత్వ ఆస్తి అని, దానిని ప్రభుత్వం ఆదేశించినప్పుడు తిరిగి అప్పగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఇటీవల సుప్రీంకోర్టు ‘ఆధార్’ అనేది పౌరసత్వానికి కచ్చితమైన నిరూపణ కాదని, అది కేవలం గుర్తింపు పత్రమేనని తెలిపింది. దాంతో దేశంలో పౌరసత్వానికి సరైన ఆధారం ఏమిటంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

