ముంబై, జూలై 24: మస్కట్ నుంచి ముంబైకి గురువారం బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. థాయలాండ్కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలికి పురిటి నొప్పు లు మొదలవ్వటంతో, విమాన సిబ్బంది వెంటనే స్పందించి ప్రసవం సురక్షితంగా జరిగేట్టు సాయమందించారు. విమానం ఆకాశంలో ఉండగానే.. థాయ్ ప్రయాణికురాలు పండం టి మగబిడ్డకు జన్మనిచ్చిందని ఎయిరిండియా వెల్లడించింది.
క్యాబిన్ సిబ్బంది, విమానంలోనే ఉన్న ఒక నర్సు ప్రసవానికి సహాయం చేశారని పేర్కొన్నది. ఫ్లైట్ ముంబై విమానాశ్రయంలో దిగిన వెంటనే విమానం పైలట్లు ప్రాధాన్యతతో కూడిన ల్యాండింగ్ చేపట్టారని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను అప్రమత్తం చేశారని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. దవాఖానలో సాయపడేందుకు ఒక మహిళా సిబ్బందిని కూడా ఆమె వెంట పంపామని పేర్కొన్నది.