Parole For Wedding | ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు.. హత్య కేసులో దోషికి పెరోల్..!
Parole For Wedding | కర్ణాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి కర్ణాటక హైకోర్టు వివాహం చేసుకోవడానికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి తల్లితో పాటు ప్రియురాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు పెరోల్ ఇచ్చింది.
Parole For Wedding | కర్ణాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి కర్ణాటక హైకోర్టు వివాహం చేసుకోవడానికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి తల్లితో పాటు ప్రియురాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు పెరోల్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ హత్య కేసులో ఆనంద్ అనే యువకుడికి పదేళ్ల శిక్ష పడింది. ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
అయితే, ఆనంద్ తల్లి రత్నమ్మ, కాబోయే భార్య జీ నీత ఎమర్జెన్సీ పెరోల్ కోరుతూ హైకోర్టు హైకోర్టును ఆశ్రయించారు. నీత, ఆనంద్ ఇద్దరూ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారని రత్నమ్మ తెలిపింది. ఇద్దరూ తమ ఇష్టానుసారం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని చెప్పింది. ఆనంద్‌ను విడుదల చేయకుంటే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని నీత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు అసాధారణ పరిస్థితిగా పేర్కొన్న కోర్టు ఈ మేరకు పెరోల్ మంజూరు చేసింది.
ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆనంద్‌ను విడుదల చేయాలని జైలు అధికారులను ఆదేశించింది. అయితే, పెళ్లి చేసుకోవడానికి పెరోల్ మంజూరు చేసే నిబంధన లేదని కోర్టులో ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. అయితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న అంగీకరించలేదు.
అసాధారణ పరిస్థితిగా పరిగణించి ఖైది ఆనంద్‌కు పెరోల్ మంజూరు చేశారు. పెరోల్ గడువు ముగిసిన తర్వాత ఖైదీని తిరిగి జైలుకు తరలించేలా చూడాలని అధికారులను ఆదేశించింది. అయితే, నిర్బంధంలో ఉన్న వ్యక్తి తిరిగి జైలుకు వచ్చే వరకు.. పెరోల్‌పై ఉన్న ఖైదీ మరే నేరం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆనంద్ ఆరేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. హత్య కేసులో ఆనంద్‌కు జీవిత ఖైదు పడగా.. హైకోర్టులో అప్పీల్ చేసుకోగా.. శిక్షను కోర్టు పదేళ్లకు తగ్గించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

