న్యూఢిల్లీ, మే 8: మహిళలు, పిల్లలపై అత్యాచారం, తీవ్రమైన లైంగిక దాడి, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు పెరోల్‌పై పూర్తి నిషేధం విధించాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) త్వరలో కేంద్రానికి సిఫార్సులు సమర్పిస్తుందని కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ శుక్రవారం తెలిపారు. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఇటీవల జరిగిన లైంగిక దాడి కేసు నేపథ్యంలో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
మహిళలు, పిల్లలపై ఘోరమైన నేరాలకు పాల్పడిన దోషులకు ప్రస్తుత పెరోల్ విధానంపై కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.