న్యూఢిల్లీ, జూలై 2: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21న ప్రారంభమై ఆగస్టు 21 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం తెలిపారు. ఈ వర్షాకాల సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారన్నారు.
అయితే భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగస్టు 13, 14 తేదీలలో సమావేశాలు ఉండవని చెప్పారు. కాగా, అంతకుముందు ఆగస్టు 12 వరకే సమావేశాలు జరిగేవని, ఈసారి వాటిని వారం రోజులు పొడిగించినట్టు ఆయన చెప్పారు.