న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రస్తుతం ఎరువులపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. రసాయనాలు, ఎరువులపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ తన నివేదికను బుధవారం పార్లమెంట్ ముందుంచింది. ‘ఎరువులపై జీఎస్టీ 5 శాతం విధిస్తూ, ఎరువుల తయారీలో ముఖ్యమైన ముడి పదార్థాలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఈ వ్యత్యాసం ఎందుకో అర్థం కావడం లేదు. ఫర్టిలైజర్లలో వాడే సల్ఫర్ లాంటి ముడిపదార్థాలు డిటర్జెంట్, పెయింట్స్ తయారీలోనూ వాడతారని ప్రభుత్వం చెబుతున్నది. అయితే రైతు ప్రయోజనాల కోసం వీటిపై జీఎస్టీ తగ్గించాలి’ అని ప్యానల్ సూచించింది.