న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతం వారికి ఉపాధి కల్పించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో కూలీల వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతుండటం పట్ల పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అట్డడుగు వర్గాలకు చెందిన కూలీలకు మరింత సహకారాన్ని అందించేందుకు అత్యవసరంగా సంస్కరణలు చేపట్టాలని సూచించింది. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ స్టాండింగ్ కమిటీ తన 8వ నివేదికను గురువారం పార్లమెంట్‌కు సమర్పించింది.