న్యూఢిల్లీ: పార్లమెంట్(Parliament) శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఇవాళ లోక్‌సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడ్డాయి. వీబీ జీ రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అయితే ప్రశ్నోత్తరాల సమయానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చివరి రోజు సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. మన్రేగా స్థానంలో కేంద్ర ప్రభుత్వం జీ రామ్ జీ బిల్లును తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ గురువారం విపక్షాలు ఆందోళన చేపట్టాయి. బిల్లు ప్రతులను చింపి, నినాదాలు చేశాయి. మూజువాణి ఓటు ద్వారా రాజ్యసభలోనూ ఆ బిల్లు పాసైంది.
इस सत्र में 15 बैठकें हुईं।
सभा की उत्पादकता 111 प्रतिशत रही।
लोकसभा अध्यक्ष ने सदन की कार्यवाही अनिश्चितकाल के लिए स्थगित कर दी |#LokSabha adjourned sine die.@LokSabhaSectt @loksabhaspeaker #ParliamentWinterSession2025 pic.twitter.com/Os2Gp9v090
— SansadTV (@sansad_tv) December 19, 2025
మరో వైపు జీరామ్‌జీ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో రాత్రంతా టీఎంసీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఆ బిల్లుపై రెండు సభల్లోనూ ఎటువంటి చర్చ చేపట్టలేదని, బుల్డోజ్ చేశారని టీఎంసీ ఎంపీలు ఆరోపించారు. సంవిదాన్ సదన్ గేటు వద్ద తృణమూల్ ఎంపీలు ధర్నా చేపట్టారు. గాంధీ,ఠాగూర్ ఫోటోలు ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. తృణమూల్ ఎంపీలు 12 గంటల ధర్నా చేపట్టారని, అర్థరాత్రి ధర్నా స్టార్ట్ చేశామని, ఇవాళ మధ్యాహ్నం వరకు తాము ధర్నా చేయనున్నట్లు టీఎంసీ నేత సాగరికా ఘోష్ తెలిపారు. మోదీ సర్కారు బుల్డోజ్ చర్యలకు పాల్పడుతున్నట్లు ఎంపీ సాగరిక ఆరోపించారు.
రాజ్యసభను కూడా ఇవాళ నిరవధికంగా వాయిదా వేశారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ 269వ రాజ్యసభ సమావేశాలు ముగిసినట్లు వెల్లడించారు. తనను రాజ్యసభ చైర్మెన్‌గా ఎంపిక చేసినందుకు సభ్యులకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. సభా కార్యక్రమాలు జరిగిన తీరు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మునుముందు కూడా ఇలాగే సభ కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జీరో అవర్, క్వశ్చన్ అవర్ చాలా ప్రయోజనకరంగా జరిగినట్లు సీపీ రాధాకృష్ణన్ తెలిపారు.