29నే పార్లమెంట్ సమావేశాల ముగింపు?
షెడ్యూల్ కంటే వారం ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, ఇతర విపక్ష పార్టీల ఎంపీల ఆందోళనలతో ఉభయసభలు ప్రతిరోజూ అట్టుడుకుతున్నాయి.
- షెడ్యూల్ కంటే వారం ముందుగానే..
- కేంద్ర ప్రభుత్వం యోచన
- అదానీ అంశంపై
విపక్షాల ఆందోళనలతో అట్టుడుకుతున్న ఉభయ సభలు
(న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి)
షెడ్యూల్ కంటే వారం ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదానీ-హిండెన్‌బర్గ్ నివేదిక అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, ఇతర విపక్ష పార్టీల ఎంపీల ఆందోళనలతో ఉభయసభలు ప్రతిరోజూ అట్టుడుకుతున్నాయి. అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలను కుదించేందుకు కేంద్రం యోచిస్తున్నది.
వాస్తవానికి వచ్చే నెల 6 వరకు సమావేశాలు జరుగాల్సి ఉండగా, ఈ నెల 29నే వాటిని ముగించాలని భావిస్తున్నది. గత నెల 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ను రెం డు సభల్లో ఆమోదింపజేసుకొన్న తర్వాత పార్లమెంట్‌ను నిరవధిక వాయిదా వేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. గురువారం లోక్‌సభలో, శుక్రవా రం లేదా సోమవారం రాజ్యసభలో బడ్జెట్‌ను పాస్ చేసుకోవాలనుకొంటున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- adani
- Delhi
- Opposition
- Parliament
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

