న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సమావేశాలు ప్రారంభమై, డిసెంబరు 25లోపు ముగుస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్లకు బదులుగా ప్రతిపాదించిన బిల్లులపై సమావేశాల్లో చర్చ జరుగవచ్చునని తెలిపాయి. వీటిపై మూడు నివేదికలను ఇటీవల హోం శాఖ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ఎన్నికల కమిషనర్ల బిల్లు కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది.