న్యూఢిల్లీ: పార్లమెంటు దేశ ప్రజాస్వామ్య దేవాలయమని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు పార్లమెంటు అత్యున్నత వేదిక అని చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తరచూ అంతరాయాలతో అర్ధాంతరంగా ముందే వాయిదాపడిన నేపథ్యంలో రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల సత్తాను ప్రశంసించారు. ‘మన దేశం స్వాతంత్య్రం సాధించినప్పుడు అదెంతో కాలం మనలేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ పూర్వకాలం నుంచే ఈ నేలలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకున్నదని వారికి తెలియద’ని వ్యాఖ్యానించారు.